Facebook announces ?32 crore grants for SMBs in India

హైదరాబాద్‍ సహా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోగల 3వేలకు పైగా చిరు వ్యాపారులకు ఫేస్‍బుక్‍ రూ.32 కోట్ల సాయం చేయనున్నది. 30 దేశాల్లో కరోనాతో చితికిపోయిన చిన్న వ్యాపారులకు 100 మిలియన్‍ డాలర్ల సాయం చేస్తామని ఈ ఏడాది మార్చిలో ఫేస్‍బుక్‍ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‍, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుర్గావ్‍ చిరు వ్యాపారులకు రూ.32 కోట్ల సాయాన్ని ప్రకటించింది. రోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలు పెంచుకునేందుకు వీలుగా తోడ్పాటు అందించేందుకు గ్రాంట్ ప్రకటించినట్లు తెలిపింది.