
కనీవినీ ఎరుగని నష్టాల ఊబిలో తెలుగు సినీ పరిశ్రమ....
2021లో అయినా థియేటర్లు తెరుచుకుంటాయా?
త్రేతాయుగం లో 18 రోజుల వ్యవధి లోనే గెలుపోటముల ఫలితాన్నిఇచ్చింది మహాభారత కురుక్షేత్ర యుద్ధం. ఈ కలియుగం లో కంటికి కనిపించని సుక్ష్మ్యా క్రిమితో మానవాళి యుద్ధం జరుపుతుంది, ఈ యుద్ధం ఆరు నెలలుగా జరుగుతూనే వుంది ఇంకెతకాలం జరుగుతుందో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి అన్ని వ్యాపార రంగాలను అతలాకుతలం చేసింది. ఇక సినిమా రంగం విషయానికొస్తే.... కనీవినీ ఎరుగని నష్టాల్లోకి నెట్టేసిన కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తి ఎప్పుడనేది సినీ మేధావులకు అర్ధం కావడం లేదు. కరోనాతో సహజీవనం తప్పదనుకుని తగిన జాగ్రత్తలతో షూటింగ్స్ చేసేద్దామని అనుకున్న వాళ్లు కూడా మన దేశం కరోనా కేసుల్లో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లడం అందులో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోన్న కేసులకి తోడు సినీ కుటుంబం నుండి అమితాబ్, రాజమౌళి, బాల సుబ్రహ్మణ్యం, బండ్ల గణేష్, వంటి వారు కరోనా బారిన పడడంతో బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం కంటే నష్టాన్ని పంటి బిగువున భరించి ఒకేసారి అన్నీ సర్దుకున్నాకే సినిమాల షూటింగులు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ యేడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరూ, ఆలా వైకుంఠపురంలో....జంట ఘన విజయాలతో మంచి బోణి కొట్టిన తెలుగు చిత్ర పరిశ్రమకు కరోనా మహమ్మారి చీడ పురుగుగా దాపురించింది. పరిస్థితి చూస్తే ఇక ఈ ఏడాది చివరి వరకు ఆశలు సన్నగిల్లుతున్నాయి.
వ్యాక్సిన్ వచ్చేన్త వరకు పరిస్థితులు కుదుటపడవని భావిస్తున్నారు. అయితే ఈ నష్టం ఈ ఒక్క ఏడాదితో అయిపోయేది కాదు. నిర్మాణంలో వున్న పెద్ద సినిమాల్లో వకీల్‌సాబ్ తప్ప ఏదీ దగ్గర్లో విడుదయ్యే అవకాశమే లేదు. మహేష్ ‘సర్కారు వారి పాట, అల్లు అర్జున్ ‘పుష్ప' వచ్చే యేడాదిలోనే సెట్స్ మీదకు వెళతాయి. అంటే నెక్స్ట్ ఇయర్ చివరకు గానీ విడుదయ్యే అవకాశముండదు. అలాగే చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వచ్చే వేసవిలోగా విడుదయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇక ఆర్.ఆర్.ఆర్. విషయానికొస్తే 2022లోనే అనేస్తున్నారు. థియేటర్లు తెరిచినా... పెద్ద సినిమాలు విడుదల కాకపోతే మార్కెట్ కుదురుకునే అవకాశముండదు. కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పట్నుంచి ఏడాది చివరి వరకు కరోనాతో యుద్ధం తప్పదు.
సిక్స్టీ ప్లస్ హీరోలు సైలంట్ అయిపోయారు స్టార్ట్ అప్ ఎప్పుడో?
55 సంవత్సరాల వయసు పై బడిన వారికి కరోనా వైరస్ సోకితే ప్రమాదమని ఆరోగ్య సంస్థలు చెపుతున్నాయి ఈ నేపద్యము లో టాలీవుడ్ లోని ఆ నలుగురు సిక్స్టీస్ సీనియర్ హీరోలే. వారిలో ఒక్క నాగార్జున తప్పించి మిగతా ముగ్గురు హీరోలు తమ చిత్రాల అప్ డేట్స్ విషయంలో టోటల్ గా సైలంట్ అయిపోయారు. సెట్స్ మీదున్న తమ చిత్రాల గురించి నేటితరం లీడింగ్ హీరోలు హల్ చల్ చేస్తుంటే...మేము మాత్రం ఇలా కామ్ గానే ఉంటామంటున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోలుగా లాంగ్ టైమ్ కెరియర్ కొనసాగించిన హీరోలు.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లు. ఈ ముగ్గురు హీరోలు లాక్ డౌన్ టైమ్ లో.. తమ సినిమాల విషయంలో ముందునుంచి సైలంట్ గానే ఉన్నారు. ఇప్పటికీ అదే సైలన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. చిరంజీవి.. ఆచార్య, బాలయ్య.. బోయపాటి సినిమా, వెంకీ నారప్పలతో పాటు... ఆ ముగ్గురు హీరోల చేతిలో ప్రస్తుతం మంచి చిత్రాలే ఉన్నాయి. వేటికవే విభిన్న కథాంశాలతో రూపొందుతున్నాయి. ఈ నలుగురు హీరోల అభిమానుల కూడా వీటిపై మంచి అంచనాలతోనే ఉన్నారు. అయితే అందరికంటే ముందుగా చిరంజీవి-కొరటాల కాంబోలో రూపొందుతోన్న ఆచార్య చిత్రం ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఆచార్య సినిమా షూట్ సగం వరకు పూర్తయింది. రామ్ చరణ్ వచ్చి జాయిన్ అయితే మిగిలిన షూట్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో ఈ అక్టోబర్ నెలలో ఆచార్య సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇక వెంకటేష్ దగ్గరికి వస్తే..నారప్ప షూట్ కు దాదాపు 5నెలల గ్యాప్ వచ్చింది. అయితేనేం అప్పటికే సినిమా 90శాతం పూర్తయింది. అన్నీ వర్కవుట్ అయితే ఈ ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాదిగానీ సినిమా పెండింగ్ షూట్ ప్రారంభమవుతుంది. ఇక ఆఫ్టర్ లాక్ డౌన్ ఉంటుందనుకున్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ..బాలయ్య బాబు. బోయపాటితో బాలకృష్ణ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ఇంకా 80శాతం వరకు షూట్ అలాగే పెండింగ్ లో ఉంది. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్ సర్కులేట్ అవుతున్నాయి. అవేవి కరెక్ట్ కాదని బోయపాటి ఇప్పటివరకు చెప్పనేలేదు. ఎంత సర్క్యులేట్ అయితే అంత ప్రమోషన్ అనుకున్నాడో ఏమో. అలాగే ఈ సినిమాకు ముందు అనుకున్న 60కోట్ల బడ్జెట్ ను కుదించి 40కోట్లకు సెట్ చేశారు.డిసెంబర్ లో ఈ ఫిలిం షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆ నలుగురు సీనియర్ హీరోలు లలో నాగార్జున తప్పించి, వచ్చే ఏడాదికి గాని ప్రేక్షకులను అలరించడానికి రారు ఏమో అనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఇప్పటికే రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది.
రెడీ ఫర్ రిలీజ్ మూవీస్
సస్పెన్సు క్రైమ్ థిల్లర్ కధాంశం గా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నిర్మించిన 'నిశ్శబ్దం' మార్చిలో విడుదల చేయడానికి డేట్ కూడా కంఫర్మ్ చేసారు. కరోనా క్రైసిస్ కారణంగా విడుదల నిలిపివేశారు. ఈ చిత్రం కేవలం థియేటర్ లోనే చూడాలని ఇంట్లో చిన్న స్క్రీన్ పై చూస్తే ప్రేక్షకుడు ఆ థ్రిల్ పొందలేరని, నిర్మాతలు థియేటర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలోనే "నీ నీలి కన్ను సముద్రం" సాంగ్ సోషల్ మీడియాలో 120 మిలియన్ల పైగా వీక్షించడం తో సినిమాకు మంచి క్రీజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని కూడా థియేటర్ లోనే విడుదల చేయాలనీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అనుకుంటున్నారు. ప్రఖ్యాత యాంకర్ ప్రదీప్ నటించిన '30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?' కరోనా అలజడి మొదలవకముందే ఈ చిత్రలోనే "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా" పాట సెన్సషనల్ హిట్ కావడంతో ఓ టి టి మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. ఈ చిత్రాన్ని కూడా సినిమా హాల్లోనే విడుదల చేయడానికి డేట్ ఇచ్చారు. ఈ నిర్మాతల అదృష్టమేమో కానీ విడుదల ఆగినందుకు మరింత ఫాన్సీ ఆఫర్ ఇస్తున్నారు ఓ టి టి వారు కారణం "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా" సాంగ్ 200 మిలియన్ల పైగా వ్యూస్ తో తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆల్రెడీ డేట్ తో యాడ్స్ విడుదల చేసిన ' ఒరేయ్ బుజ్జిగా' ఆహా లో అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటన ఇచ్చారు. మరిన్ని సినిమాలు ఓ టి టి వైపు చూస్తున్నాయి. రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన మార్కెట్‌ని స్టేబులైజ్ చేసుకునే అవకాశాన్ని అతను ఎట్టి పరిస్థితి ల్లోనూ రెడ్ సినిమాను ఓ టి టికి వదుకునేందుకు సిద్ధంగా లేడని సమాచారం. ఆరు నూరైనా నా చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్ లోనే విడుదల చేస్తాను అని పట్టు పట్టుకున్నాడు.
మిడిల్ రేంజ్ హీరోల షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి
రాధే శ్యామ్ షూటింగ్ కోసం ప్రభాస్ రెండోవారంలో ఇటలీ వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున అయితే ఇప్పటికే బిగ్ బాస్, వైల్డ్ డాగ్ మూవీస్ షూట్ మొదలుపెట్టేశాడు. సాయి ధరమ్ తేజ్ ఫిలిం సిటీ లో సోలో బ్రతుకే సో బెటరు షూటింగ్ లో వున్నాడు. నాగ చైతన్య శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ షూటింగ్ మొదలు పెట్టేసారు. క్రిస్స్ వైష్ణవ్ తేజ్, రకుల్ వికారాబాద్ ఫారెస్ట్ లో షూటింగ్ చేస్తున్నారు.ఇక నాని.. నితిన్ వంటి యంగ్ హీరోలు ఈ నెలలోనే కెమెరా ముందుకొస్తున్నారు. ఇలా అందరూ వస్తున్నా... ప్రస్టేజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి ట్రిపుల్ ఆర్ షూట్‌కు ముహూర్తం పెట్టాడు. 2020 జులై 31న రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశారు. షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం కావడంతో... 2021 జనవరి 8నాటికి వాయిదాపడింది. కరోనా రాకతో.. మరోసారి పోస్ట్‌పోన్ తప్పలేదు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే సమ్మర్‌కు తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది చిత్ర యూనిట్. షూటింగ్ మరింత ఆలస్యమైతే.. సమ్మర్‌కు వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు.
థియేటర్ తెరిచిన ప్రేక్షకులు వస్తారనేది డౌటే.. అందుకే ఓ టి టి వైపు మొగ్గు
సినిమా హాళ్లు తెరుచుకొండీ అని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన ప్రజలు నిర్భయంగా థియేటర్ సీట్లలో కూర్చుంటారని నమ్మకం లేదు. నార్మల్ డేస్ వచ్చేన్తా వరకు కష్టమే అంటున్నారు నిర్మాతలు. ఏ సినిమాకి అయినా లాభనష్టాలను భరించేది నిర్మాతే కనుక తన చిత్రానికి బిజినెస్ పరంగా ఏది బెస్ట్ అనేది అతనికే తెలుసు. అందుకే ప్రస్తుత క్రైసిస్‌లో ఓటిటి రిలీజ్ బెస్ట్ అని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. అలాగే థియేటర్లు తెరచినా మునుపటి మాదిరి స్పందన ఇప్పట్లో కష్టమవుతుంది. అందుకే ఓటిటి నుంచి మంచి డీల్ వస్తే సేల్ చేసేయాలని నిర్మాతలు చూస్తున్నారు. కానీ హీరోలు మాత్రం అందుకు సుముఖంగా లేరని వినిపిస్తోంది. చిన్న చితక సినిమాలను ఇటీవల ఓ టి టి లో వేదిక గా విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన 'వి' చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఆ సినిమా మీదున్న క్రెజ్ తో దిల్ రాజు గట్టు ఎక్కాడు. అమెజాన్ ప్రైమ్ వారికీ ఎంత మేర లాభం వస్తుందో లాంగ్ టైములో కానీ చెప్పలేము.
ఫ్లాప్ అయిన వాళ్లకోసం కొత్త గ్రౌండ్
టీవీ రంగాన్ని ఎలాగయితే సినిమా వాళ్లు చిన్నగా చూస్తారో ఓటిటిని కూడా అలాగే చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం బడా స్టార్లు సినిమాలు చేసే హాలీవుడ్ తరహా వెబ్ సిరీస్ లు, మూవీస్ ఇవ్వడం ఇక్కడ ఇంకా రాలేదు. అంతెందుకు... థియేటర్లు మూత పడి, ఓటిటి రిలీజ్ ఒకటే ఆప్షన్‌గా మిగిలినా కానీ థియేటర్లు తెరుచుకునే వరకు వేచి చూడాల్సిందే అంటూ హీరోలు డిసైడ్ అయ్యారు. డైరెక్టర్లు కూడా తమ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సిందేనని నిర్మాతపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఓటిటి కూడా సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమనేది నిర్మాతలు గ్రహించారు. అందుకే ప్రస్తుతం ఓటిటి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడంపై ఫోకస్ పెడుతున్నారు. కాకపోతే ఆ కంటెంట్ చేయడానికి ఫామ్‌లో ఉన్న దర్శకులు లేదా నటులు అందుబాటులో లేరు. అందుకే ఫ్లాప్స్‌తో వెనుకబడిన హీరోలను దర్శకులను, హీరోయిన్లను అప్రోచ్ అవుతున్నారు. థియేటర్లలో విడుదయ్యే సినిమాలకు ఆయా పామ్ లో వున్న నటి నటులు దర్శకులు అవసరం కనుక ఓ టి టి మంచి ఆఫర్ ఇచ్చింది అప్పటికే ప్రస్తుత వాళ్లకు మాస్ మార్కెట్ కంటే ఇది బెస్ట్ గ్రౌండ్ అనిపిస్తోంది. ఈ లాక్డౌన్ వ్ల ప్రయోజనం జరిగిందెవరికైనా వుంటే అది వీళ్లకే అనవచ్చు.
సినిమా పండగల సీజన్ టోటల్ లాస్
ఏడాదో పొడుగునా వారానికి రెండు మూడు సినిమాలు విడుదలైనా భారీ చిత్రాలు విడుదలయ్యేది పండగల సీజన్లలోనే. సినిమా పండుగలంటే ఏడాది లో తొలుత వచ్చేది సంక్రాంతి, ఆ తరువాత సమ్మర్ హాలిడేస్, స్కూల్స్ కాలేజీలు ఓపెనింగ్ అప్పుడు యూత్ మూవీస్ సీజన్, తరువాత దసరా దీపావళి పండగలు ఇక క్రిష్మస్ పండగ సీజన్ ఇలా సినిమా బిజినెస్ కి ముఖ్యమైన రోజులు కానీ ఈ సారి కరోనా పుణ్యమా అని సంక్రాంతి తప్పించి ఏడాది పొడుగునా కోట్లాది రూపాయల నష్టాన్ని టాలీవుడ్ చవిచూడాల్సి వస్తుంది.
సినీ కార్మికులకు అండగా చిరు ‘CCC’ తో ముందడుగు.. ఇంటింటికీ నిత్యావసరాలు, మందులు
ఈ కరోనా లక్డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో రోజువారీ వేతనం పై బ్రతికే సినీ కార్మికులకు పేద కళాకారుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏర్పడిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ మరో ముందడుగు వేసింది.కరోనా వైరస్ విజృంభణతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నడుం బిగించింది. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలందరూ కలిసి ‘మనకోసం’ పేరిట కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేసి భారీగా విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఛారిటీకి కోట్ల విరాళాలు అందటంతో మరో ముందడుగు వేసింది సీసీసీ. ఇప్పటివరకు ఇక్కడున్న అన్ని అసోసియేషన్లుకు , యూనియన్లకు , సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్ కి 13,500 మందికి మూడు సార్లు ఇంటింటికీ నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం జరిగింది.