Trump hails dawn of new Middle East with UAE Bahrain Israel deals

పశ్చిమాసియాలో శాంతి నెలకొనే దిశగా మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ సమక్షంలో ఇజ్రాయెల్‍, యూఏఈ, బహ్రెయిన్‍ ఒప్పందాలు చేసుకున్నాయి. వైట్‍హౌస్‍లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్‍ సాక్షిగా  వ్యవహరించారు. ఇజ్రాయెల్‍, యూఏఈ  మధ్య గత నెలలోనే ఒప్పందం కుదిరింది. దౌత్యపరమైన సంబంధాలు పునరుద్ధరించుకున్నాయి. ఇజ్రాయెల్‍-బహ్రెయిన్‍ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మూడు దేశాలు లాంఛనంగా సంతకాలు చేశాయి. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‍ వైఖరిపై చాలా అరబ్‍ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఇజ్రాయెల్‍తో దౌత్య సంబంధాలకు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందాలు పశ్చిమాసియా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.