Former Jayalalithaa aide Sasikala may be released on January 27

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ వచ్చే ఏడాది జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని కర్ణాటక జైళ్ల శాఖ వెల్లడించింది. ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ఈ మేరకు జైళ్ల శాఖ నుంచి సమాధానం వచ్చింది. జరిమానా చెల్లించకుంటే మరో 13 నెలలు జైల్లో గడపాల్సి ఉంటుందని, అప్పుడు 2022 ఫిబ్రవరి 27న విడుదలవుతారని పేర్కొంది.