cm-kcr-speech-on-new-revenue-act-bill-2020-in-assembly

ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల విషయములో నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం కెసిఆర్ గారు మాట్లాడుతూ ‘ఆధార్‌ లేనంత మాత్రాన ఎన్నారైల భూమి పోకూడదు. వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌ లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదైనా రుజువు పత్రం తీసుకొని, వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు. దీని వలన ప్రపంచవ్యాప్తంగా వున్నా తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుందని మహేష్ బిగాల గారు అన్నారు, చరిత్రలో ఇంత పెద్ద నిర్యయాన్ని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదు, ఇప్పటివరకు ఎన్నారైలకు అమ్మాలన్న కొనాళ్లన్న ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఈ ఆలోచన వలన ఎంతో మంది ఎన్నారై లకు మేలు జరుగుతుంది అని, ఎన్నారైల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగల గారు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.