ap-cm-ys-jagan-review-on-new-educational-policy

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు, ప్రయోజనాలపై చర్చించారు. ఈ సమావేశంలో  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‍తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యకు ప్రభుత్వం ఇదివరకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకురావడంతో ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

అనంతరం మంత్రి సురేష్‍ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు దానిలో ఉన్నాయి. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్‍ వాడీ విద్యకు, స్కూల్‍ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1, పీపీ2 తో మరొక ఏడాది పెంచుతున్నాం. హైస్కూల్‍ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయి. అవి కేవలం వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే. 10వ తరగతిలో బోర్డు పరీక్షలు యధావిధిగా ఉంటాయి. ఉన్నత విద్యను కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రం నుంచే చదువుకునే విద్యార్థులు అని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు.