Rana to play Villain role in Allu Arjun s Pushpa Movie

టాలీవుడ్ లో గత కొంత కాలంగా కొంతమంది హీరోలు విలన్ పాత్రలు కూడా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే వి చిత్రంలో నాని నెగటివ్ రోల్ చేసిన విషయం విదితమే. ఇంకా మరికొంత మంది నెగటివ్ పాత్రలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో స్టార్ హీరోలు ఇప్పుడు ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. కొంత మంది స్టార్ హీరోలు సైతం  తమ సినిమాల్లో చేయటానికి కొన్ని పాత్రలను సిద్దం చేసుకునే పరిస్థితి కూడా టాలీవుడ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా దీనికి మంచి ఆదరణ కూడా లభిస్తున్న సంగతి తెలిసిందేఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది.

పుష్ప సినిమాలో ఒక స్టార్ హీరో కి నెగటివ్ పాత్ర ఇవ్వడానికి అల్లు అర్జున్ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప అనే సినిమాలో నెగిటివ్ రోల్ కి గాను రానాని అడిగినట్టు గా సమాచారం. దీనికి రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే రానా బాహుబలి సినిమాలో నెగటివ్ రోల్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో రానా పాత్ర చాలా బాగా హైలెట్ అయ్యింది. ప్రభాస్ తో సమానంగా  రానా  పాత్రకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలో  రానాను తీసుకుంటే సినిమా మార్కెట్ కూడా బాగుంటుంది అనే భావనలో అల్లు అర్జున్ ఉన్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా పాత్ర ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం రానా బాలీవుడ్ లో ఒక సినిమాతో పాటుగా తెలుగులో మూడు సినిమాలు తమిళంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ కూడా కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు వాయిదా పడ్డాయి.