Another Trump assault on science as fires and pandemic rage

అమెరికా అడవులలో రాజుకున్న అగ్ని రోజురోజుకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మంటలు అనేక రాష్ట్రాలకు విస్తరించి 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని గురించి విపక్షాలు డొనాల్డ్ ట్రంప్‍ను ప్రశ్నించాయి. తన ప్రచారంలో ఎక్కడా కాలిఫోర్నియా ఫైర్‍ గురించి మాట్లాడలేదని నిలదీశాయి. దీంతో ట్రంప్‍ స్పందించారు. మంటలు అనేది వాతావరణానికి సంబంధించిన విషయం కాదని, మేనేజ్‍మెంట్ కు సంబంధించిన విషయం అని ట్రంప్‍ పేర్కొన్నారు. త్వరలోనే మంటలు చల్లబడతాయని తెలిపారు.

మంటలపై విపక్షాలు ప్రశ్నించగా ఆయన పైర్‍ ఫైటర్స్ ను కలిశారు. వాతావరణ మార్నే దీనికి కారణమా అని ఒక రిపోర్టర్‍ ట్రంప్‍ని ప్రశ్నించగా వేరే దేశాలకు ఈ సమస్య లేదని, ఆ దేశాలతో తొందరగా మంటలు అంటుకునే చెట్టు ఉన్నాయనీ, కానీ వారు అలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదని ట్రంప్‍ తెలిపారు. అందుకే ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన మార్పు కాదు, మేనేజ్‍మెంట్‍కు సంబంధించిన విషయం అని తెలిపారు. త్వరలోనే మంటలు చల్లబడతాయి మీరే చూడండి అని ట్రంప్‍ తెలిపారు. ఈ విషయం సైన్స్ కు సంబంధించిన విషయం కాదని తాను అనుకుంటున్నానని ట్రంప్‍ పేర్కొన్నారు.