Donald Trump warns Iran of severe retaliation if diplomat attacked

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఇరాన్‍కు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అమెరికాపై ఏదైనా డాది జరిగితే అంతకుమించి 1,000 రెట్లు ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ఇరాన్‍ టాప్‍ మిలటరీ జనరల్‍ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని టెహ్రాన్‍ యోచిస్తున్నట్లు మీడియా వార్తలు రావడంతో ట్రంప్‍ తాజా హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాద నాయకుడు సులేమాని హత్యకు ప్రతీకారంగా అమెరికాపై ఇరాన్‍ హత్య, లేదా ఏ రూపంలోనైనా, ఎలా దాడిచేసినా దానికి వెయ్యిరెట్లు అధికంగా ప్రతి స్పందిస్తామంటూ ట్వీట్‍ చేశారు.