India records 83809 new cases in 24 hours tally crosses 49 lakh mark

దేశంలో కరోనా వైరస్‍ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్‍ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‍ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది. తాజాగా వైరస్‍ బారినపడి 1054 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మృతి చెందిన వారు సంఖ్య 80,776కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 79,292 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 38,59,400గా నమోదైంది. దేశంలో 78.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‍లో పేర్కొంది.

యాక్టివ్‍ కేసుల శాతం 20.08 శాతం ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టీవ్‍ కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 10,72,845 కరోనా వైరస్‍ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్‍ నిర్ధారణ పరీక్షల సంఖ్య 5,83,12,273గా నమోదైనట్లు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.