Naomi Osaka returns to top 3 in WTA singles rankings

యూఎస్‍ ఓపెన్‍ తాజా చాంపియన్‍ నవోమి ఒసాక మహిళల టెన్నిస్‍ ర్యాంకింగ్స్ టాప్‍-3లో చేరింది. ఈ జపాన్‍ భామ యూఎస్‍ ఓపెన్‍లో సాధించిన టైటిల్‍తో ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‍ దక్కించుకొంది. బార్జీ (ఆస్ట్రేలియా), హలెప్‍ (రొమేనియా) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 59వ ర్యాంక్‍తో యూఎస్‍ ఓపెన్‍లో అడుగు పెట్టిన వరల్డ్ మాజీ నెంబర్‍ వన్‍ విక్టోరియా అజరెంకా ఈ గ్రాండ్‍స్లామ్‍లో రన్నరప్‍గా నిలవడంతో టాప్‍-15లో చోటు సంపాదించింది.