UGC NET 2020 Postponed Check New Exam Dates And Schedule Details here

యూజీసీ నెట్‍ తేదీలు మళ్లీ మారాయి. ఈ నెల 16-18, 21-25వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరుగుతాయని గత నెల 20న ప్రకటించిన జాతీయ పరీక్షల మండలి (ఎన్‍టీఏ) తాజాగా ఈ నెల 24 నుంచి జరుపుతామని ప్రకటించింది. అగ్రికల్చర్‍ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏఐఈఈఈ-యూజీ/పీజీ, ఏఐసీఈ-జేఆర్‍ఎఫ్‍/ఎస్‍ఆర్‍ఎఫ్‍ పరీక్షలనను ఈ నెల 16, 17, 22, 23వ తేదీల్లో నిర్వహిస్తున్నందున యూజీసీ నెట్‍ తేదీని మార్చినట్లు పేర్కొంది. పూర్తి కాలపట్టికను త్వరలో వెల్లడిస్తామంది.