awarness-programme-on-corona-in-ap-labour-departnment

అమెరికా నుంచి వైద్యులు అందించే సూచనలు, సలహాలు పాటించి కార్మికులంతా కరోనా నుంచి రక్షణ పొందాలని ఆంధప్రదేశ్‍ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‍ సూచించారు. కరోనా నివారణపై కార్మిక శాఖ ఉద్యోగులకు అమెరికా వైద్యులతో సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఉదయలక్ష్మి నిర్వహించారు. వెబినార్‍ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూనే మంచి పోషకాహారం తీసుకోవాలని, సామాజికదూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యకార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ అమెరికాకు చెందిన ఐదుగురు తెలుగు వైద్యులు సుధాకర్‍, చంద్రశేఖర్‍, శ్రీకాంత్‍, లోకేష్‍, సురేష్‍లు తమ శాఖ ఉద్యోగులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్తున్నారని చెప్పారు.