YCP MLA Ambati Rambabu on Amaravati Lands

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో ఎసిబి ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డంతో మ‌ళ్లీ అధికార విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డ‌మే పెద్ద కుంభ‌కోణ‌మ‌ని వైకాపా ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. తాము గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌ల‌పై వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు. త్వ‌ర‌లోనే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌న్నారు. అన్ని అక్ర‌మాల‌కు త‌మ ద‌గ్గ‌ర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముందుగానే లీకులు ఇచ్చి భూములు  కొనుగోలు చేశారని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఆరోపించారు. టీడీపీ పెద్దలు రాజధాని  గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని, టీడీపీ ప్రభుత్వమే ఇన్ సైడ‌ర్‌ ట్రేడింగ్ ని ప్రోత్సహించిందనీ  చెప్పారు. త‌మ త‌ప్పేమీ లేకుంటే ఎపి ప్రభుత్వం  సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి  రాసిన లేఖకు మ‌ద్ధ‌తుగా లోకేష్,చంద్రబాబు సైతం కేంద్రానికి లేఖ రాయాల‌ని ఆయ‌న స‌వాల్ చేశారు.

ప్ర‌తి విమ‌ర్శ‌లు...
రాజ‌ధాని రైతులు, అమ‌రావ‌తి ల‌పైనా, చంద్ర‌బాబుపైనా, వైకాపా ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తేదేపా నేత‌లు మండిప‌డ్డారు. బాబు అవినీతిపై సాక్ష్యాలు అందిస్తే అధికారుల‌కు రివార్డులిస్తామ‌ని జ‌గ‌న్ ఆశ‌పెడుతున్నారంటూ తేదేపా నేత వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు చేస్తూన్నార‌ని అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని బొండా ఉమ స్ప‌ష్టం చేశారు.  మ‌రోవైపు అధికార ప‌క్ష స‌భ్యులు కూడా తేదేపాపై అదే స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.