8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

8-bills-approved-in-telangana-assembly

ఎనిమిది కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఏడు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన తరువాత స్పీకర్‍ పోచారం శ్రీనివాసరెడ్డి సభను వాయిదా వేశారు. ఆమోదం పొందిన బిల్లులు... 1. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‍ విశ్వవిద్యాలయాల చట్టం -2018 సవరణ ఆర్డినెన్స్ బిల్లు-2020. 2. తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఆర్డినెన్స్ బిల్లు-2020. 3. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు పెంపు, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు-2020. 4. తెలంగాణ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‍ నిర్వహణ సవరణ బిల్లు- 2020. 5. తెలంగాణ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రెండో సవరణ బిల్లు. 6. టీఎస్‍ బీపాస్‍ బిల్లు. 7. తెలంగాణ సివిల్‍ కోర్టు చట్టం -1972 సవరణ బిల్లు. 8. తెలంగాణ కోర్టు ఫీజు, వ్యాజ్యాల మదింపు చట్టం -1956 సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.