Mahesh Babu Business Calculations

పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో మ‌హేష్‌బాబు చేసిన బిజినెస్‌మేన్ చిత్రంలో హీరో కాలిక్యులేష‌న్స్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. ఎంత ఈజీగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చో చెబుతాడు. కానీ, రియ‌ల్‌లైఫ్‌లో అంత ఈజీకాదు క‌దా. అయినా త‌న బిజినెస్ స్కిల్స్‌తో చిత్ర నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి నిర్మాతగా కూడా స‌క్సెస్ అవుతున్నాడు. చేసే ప్ర‌తి సినిమాకు త‌న సొంత బేన‌ర్ అయిన జిఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భాగ‌స్వామిగా ఉంటోంది. బ‌డ్జెట్ విష‌యంలో నిర్మాతకు భారం కాకుండా ఉండేందుకు త‌ను కూడా పెట్టుబ‌డి పెడుతున్నాడు. పెద్ద మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకునే బ‌దులు లాభాలలో వాటా తీసుకోవ‌డం వ‌ల్ల నిర్మాత సేఫ్ అవుతాడు. త‌ను కూడా లాభ‌ప‌డ‌తాడు. ఈ స్ట్రేట‌జీని ప్ర‌తి సినిమాలోనూ అప్లై చేస్తున్నాడు.. స‌క్సెస్ అవుతున్నాడు. ఒక‌ప్పుడు క‌మిట్ అయితే చాలు ఆ బేన‌ర్‌లో సినిమా చేసేసేవాడు మ‌హేష్‌. డైరెక్ట‌ర్‌ని పూర్తిగా న‌మ్మేవాడు. దానివ‌ల్ల మ‌హేష్‌కి కొన్ని ప‌రాజ‌యాలు కూడా ఎదురయ్యాయి. కానీ, ఇప్పుడ‌లా కాదు. ప్ర‌తి విష‌యం గురించి పూర్తిగా చ‌ర్చించిన త‌ర్వాతే సినిమా ఓకే చేస్తున్నాడు. 2020 సంక్రాంతి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాకి ఒప్పందం ప్ర‌కారం మ‌హేష్‌కి భారీగానే ముట్ట‌జెప్పార‌ని తెలుస్తోంది. ఇప్పుడు స‌ర్కారువారిపాట కూడా ఆ బాట‌లోనే వెళ్తోంద‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా డిజిట‌ల్, శాటిలైట్స్ రైట్స్‌ను విక్ర‌యించార‌ని తెలుస్తోంది. ఒక ప్ర‌ముఖ సంస్థ దానికోసం 35 కోట్ల రూపాయ‌లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.

స‌ర్కారువాటి పాట షూటింగ్‌ను న‌వంబ‌ర్ నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. మొద‌టి షెడ్యూల్ 50 రోజుల‌పాటు అమెరికాలో ఉంటుంద‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లో కూడా ఒక బ్యాక్‌సెట్ నిర్మించారు. ఈ సెట్ ఇంటీరియ‌ర్‌లో కొంత టాకీ పార్ట్‌ను చిత్రీక‌రిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడు ప్రారంభించేది అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. క‌రోనా ఉధృతి ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో షూటింగ్ చేసే అవ‌కాశాలు ఎంత‌వ‌ర‌కు ఉంటాయి, మ‌హేష్‌బాబు షూటింగ్ చేసేందుకు సుముఖంగా ఉన్నాడా అనేది తెలియా్ల్సి ఉంది.