Centre opposes plea seeking recognition of same-sex marriages

హోమో సెక్సువల్స్ లెస్బియన్ ల గే మ్యారేజ్ లను మన దేశంలో అనుమతించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు కు తమ అభిప్రాయం వెల్లడించింది. స్వలింగ వివాహాలను అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు లో దాఖలైన పీటీషన్ పై కేంద్రం మంగళవారం స్పందించింది. మన దేశంలో పాటించే విలువలకు ఆ తరహా పెళ్లిళ్లు విరుద్ధం అని పేర్కొంది. ఆ పెళ్లిళ్లకు మన చట్టాలు, న్యాయ వ్యవస్థ గుర్తింపుని ఇవ్వడం లేదు అని స్పష్టం చేసింది.