యూఎస్ ఓపెన్ విజేత నయోమి ఒసాకా

Naomi Osaka Beats Victoria Azarenka to Win US Open Title

ఏడాది వ్యవధిలో రెండో యూఎస్‍ ఓపెన్‍ టైటిల్‍ ను జపాన్‍ క్రీడాకారిణి, నాలుగో సీడ్‍ గా బరిలోకి దిగిన నయమీ ఒసాకా ఎగరేసుకుపోయింది. గత రాత్రి జరిగిన ఫైనల్‍ లో విక్టోరియా అజరెంకాపై 1-6, 6-3, 6-3 తేడాతో ఒసాకా విజయం సాధించింది. తొలి సెట్లో ఘోరంగా వైఫల్యం సాధించినప్పటికీ, ఏ మాత్రమూ తొణకుండ, తనదైనా ఆటతీరుతో తదుపరి సెట్లలో చెలరేగిపోయిన ఒసాకా, సునాయాసంగా టైటిల్‍ను గెలుచుకుంది. 2018లో ఓపెన్‍ను తొలిసారి గెలుచుకున్న ఒసాకా, ఏడాది గ్యాప్‍ తరువాత మరోమారు అదే టైటిల్‍ ను తన ఖాతాలో వేసుకుంది. సెమీఫైనల్‍లో సెరెనా విలియమ్స్ తో జరిగిన పోరులో 1-6, 6-3, 6-3 తేడాతో గెలిచిన అజరెంకా, అదే స్కోరుతో ఫైనల్‍లో ఓడిపోవడం గమనార్హం.