Serena Williams rallies to beat Sloane Stephens at US Open

యూఎస్‍ ఓపెన్‍లో అమెరికా స్టార్‍ ప్లేయర్‍ సెరెనా విలియమ్స్ జోరు కొనసాగుతున్నది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‍లో తొలి సెట్‍ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకొని ప్రిక్వార్టర్స్కు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‍లో 23 గ్రాండ్‍ స్లామ్‍ టైటిళ్ల విజేత, మూడో సీడ్‍ సెరెనా 2-6, 6-2, 6-2 తేడాతో తన దేశానికే చెందిన స్లోన్‍ స్టీఫెన్స్పై విజయం సాధించింది. ఆరంభంలో పూర్తిగా తడబడి తొలి సెట్‍ను చేజార్చుకున్నా ఆ తర్వాత సెరెనా తన మార్కు ఆదిపత్యంతో అదరగొట్టింది. మిగిలిన రెండు సెట్లను కైవసం చేసుకొని ముందడుగు వేసింది. మరో మ్యాచ్‍లో రెండో సీడ్‍ సోఫియా కెనిన్‍ (అమెరికా) 7-6(7/4), 6-3 తేడాతో ఓన్స్ జబెర్‍ (ట్యునిషియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది.