ఎపి సిఎం సహాయనిధికి 31 లక్షల రూపాయల విరాళం
ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలతో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిఎం సహాయనిధికి విరాళాలను అందిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్ ఎండ్లూరి ఆంజనేయులు, గుత్తా బాలాజీ, మైనేని శ్రీనివాస్, వల్లేపల్లి సూర్య కలిసి 31 లక్షల రూపాయల నిధులను విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, మంత్రి లోకేష్ ను కలిసి అందించారు. ఈ సందర్భంగా వారు ముందుకు వచ్చి సహాయం అందించడం పట్ల చంద్రబాబు నాయుడు, లోకేష్ వారికి అభినందనలు తెలియజేశారు.
Tags :