ఆ ముగ్గురు హీరోలు సైలంట్ అయిపోయారు స్టార్ట్ అప్ ఎప్పుడో?

chiranjeevi balakrishna venkatesh were silent

టాలీవుడ్ లోని  ఆ నలుగురు సిక్స్టీస్ సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జున తప్పించి  మిగతా ముగ్గురు హీరోలు  తమ చిత్రాల అప్ డేట్స్ విషయంలో టోటల్ గా సైలంట్ అయిపోయారు. రాధే శ్యామ్‌ షూటింగ్‌ కోసం ప్రభాస్‌ రెండోవారంలో ఇటలీ వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున అయితే ఇప్పటికే  బిగ్ బాస్, వైల్డ్ డాగ్ మూవీస్ షూట్‌ మొదలుపెట్టేశాడు. సాయి ధరమ్ తేజ్ ఫిలిం సిటీ లో సోలో బ్రతుకే సో బెటరు షూటింగ్ లో వున్నాడు. ఇక నాని.. నాగచైతన్య.. నితిన్‌ వంటి యంగ్‌ హీరోలు ఈ నెలలోనే కెమెరా ముందుకొస్తున్నారు. ఇలా అందరూ వస్తున్నా... ప్రస్టేజియస్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి ట్రిపుల్‌ ఆర్‌ షూట్‌కు ముహూర్తం పెట్టాడు. సెట్స్ మీదున్న తమ చిత్రాల గురించి నేటితరం లీడింగ్ హీరోలు హల్ చల్ చేస్తుంటే...మేము మాత్రం ఇలా కామ్ గానే ఉంటామంటున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోలుగా లాంగ్ టైమ్ కెరియర్ కొనసాగించిన హీరోలు.. చిరంజీవి, బాలయ్య,  వెంకటేష్ లు. ఈ ముగ్గురు  హీరోలు లాక్ డౌన్ టైమ్ లో..  తమ సినిమాల విషయంలో ముందునుంచి సైలంట్ గానే ఉన్నారు. ఇప్పటికీ అదే సైలన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు.

చిరంజీవి.. ఆచార్య, బాలయ్య.. బోయపాటి సినిమా, వెంకీ నారప్పలతో పాటు...  ఆ ముగ్గురు  హీరోల చేతిలో ప్రస్తుతం  మంచి చిత్రాలే ఉన్నాయి. వేటికవే విభిన్న కథాంశాలతో రూపొందుతున్నాయి. ఈ నలుగురు హీరోల అభిమానుల కూడా వీటిపై మంచి అంచనాలతోనే ఉన్నారు. అయితే అందరికంటే ముందుగా చిరంజీవి-కొరటాల కాంబోలో రూపొందుతోన్న ఆచార్య చిత్రం ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఆచార్య సినిమా షూట్ సగం వరకు  పూర్తయింది. రామ్ చరణ్ వచ్చి జాయిన్ అయితే మిగిలిన షూట్ పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులలో ఈ అక్టోబర్ నెలలో ఆచార్య సెట్స్ మీదకు వెళ్లే  అవకాశాలున్నాయి. ఇక వెంకటేష్ దగ్గరికి వస్తే..నారప్ప షూట్ కు దాదాపు 5నెలల గ్యాప్ వచ్చింది. అయితేనేం అప్పటికే సినిమా 90శాతం పూర్తయింది. అన్నీ వర్కవుట్ అయితే ఈ  ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాదిగానీ సినిమా పెండింగ్ షూట్ ప్రారంభమవుతుంది. ఇక ఆఫ్టర్ లాక్ డౌన్ ఉంటుందనుకున్న లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ..బాలయ్య బాబు. బోయపాటితో బాలకృష్ణ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక షెడ్యూల్ మాత్రమే  పూర్తి చేసుకుంది. ఇంకా 80శాతం వరకు షూట్ అలాగే పెండింగ్ లో ఉంది. ఇంకా  టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్  సర్కులేట్ అవుతున్నాయి. అవేవి కరెక్ట్ కాదని బోయపాటి ఇప్పటివరకు చెప్పనేలేదు. ఎంత సర్క్యులేట్ అయితే అంత ప్రమోషన్ అనుకున్నాడో ఏమో. అలాగే ఈ సినిమాకు ముందు అనుకున్న 60కోట్ల బడ్జెట్ ను కుదించి 40కోట్లకు సెట్  చేశారు. డిసెంబర్ లో ఈ ఫిలిం షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. 

ఓవరాల్ గా చూసుకుంటే ఆ నలుగురు సీనియర్ హీరోలు లలో నాగార్జున తప్పించి, వచ్చే ఏడాదికి గాని  ప్రేక్షకులను అలరించడానికి రారు ఏమో అనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా  ట్రిపుల్‌ ఆర్‌ రిలీజ్‌ ఇప్పటికే రెండుసార్లు పోస్ట్‌ పోన్‌ అయింది. షూటింగ్‌ మొదలైనప్పుడే..  2020 జులై 31న రిలీజ్‌ అంటూ ఎనౌన్స్ చేశారు. షూటింగ్‌ ఎప్పటికప్పుడు ఆలస్యం కావడంతో... 2021 జనవరి 8నాటికి వాయిదాపడింది.  కరోనా రాకతో.. మరోసారి పోస్ట్‌పోన్‌ తప్పలేదు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే సమ్మర్‌కు తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది చిత్ర యూనిట్‌. షూటింగ్‌ మరింత ఆలస్యమైతే.. సమ్మర్‌కు వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. 

 


                    Advertise with us !!!