
కోవిడ్ -19 కారణంగా నష్టపోయిన పరిశ్రమల్లో చిత్రసీమ పరిశ్రమ ఒకటి, అయితే వివిధ దేశాలలో మే , జూన్ నెలల నుంచి కొత్త నియమనిబంధనలు తో సినిమాల చిత్రీకరణ ప్రారంభం కాగా, యూ.కే లో మార్చి నెలలో ఆగిపోయిన మాట్ రీవ్స్ దర్శకత్వం లో రాబర్ట్ ప్యాటిన్సన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ది బాట్మాన్ చిత్రం బ్రిటిష్ ఫిలిం కమిషన్ ప్రకటించిన కొత్త నియమనిబంధనలు తో ఆగస్టు నెల నుంచి షూటింగ్ పునఃప్రారంభించగా, వార్నర్ బ్రోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ది బాట్మాన్ చిత్ర యూనిట్ లో ఒక వ్యక్తికి కోవిడ్ -19 సోకినందున చిత్ర షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వార్నర్ బ్రోస్ ప్రకటించింది.
అయితే చిత్ర యూనిట్ లో ఎవరికి కోవిడ్ -19 సోకింది అనే దానిపై వార్నర్ బ్రోస్ సంస్థ వివరణ ఇవ్వటానికి నిరాకరించగా, వానిటీ ఫెయిర్ మరియు హాలీవుడ్ రిపోర్టర్ కోవిడ్ పాజిటివ్ పరీక్షించి న వ్యక్తి సినిమా స్టార్ 34 సంవత్సరాల రాబర్ట్ ప్యాటిన్సన్ అని ఉదహరించినట్లు తెలిసింది. జో క్రావిట్జ్, పాల్ డానో మరియు కోలిన్ ఫారెల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.