టాప్ లెస్ సీన్లతో బూతులతో 'మగువ' ట్రైలర్ రచ్చ రచ్చ

maguva official trailer release

'మగువ' ఎంత చక్కటి టైటిల్, ఇటీవల 'వకీల్ సాబ్' చిత్రం కోసం మహిళా దినోత్సవానికి విడుదల చేసిన 'మగువ మగువ' గీతం ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి మగువ టైటిల్ తో ఇటీవల ట్రయిలర్ రిలీజ్ అయ్యింది. ఇది చూసి మరీ మరీ ఇంత అరాచకమా? ఇలాంటి ట్రైలర్ లకు సెన్సార్ ఉందా అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువయ్యాయి. సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాం అంటూ సినిమా అంతా బూతు సీన్లతో నింపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే మరీ శృతిమించిన అడల్ట్ సీన్స్ పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. సెగలు పుట్టించే సీన్స్ పెట్టేసి యువతరానికి గాలం వేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు కొందరు దర్శక నిర్మాతలు.

ఇక ఈ సంగతి అటుంచితే మోడ్రన్ యువతి ''ఆడది అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని 'మగువ' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. ''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. ఈ చిత్రం శ్రేయాస్ మీడియా ద్వారా ఓ టి టి లో విడుదల అవుతుంది.