NTR s Yamadonga completes 13 Years

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. ఇప్పుడు ఎన్టీఆర్ వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు. కానీ ఒకప్పుడు ఫుల్ వెయిట్ తో వుండీ వరుస ప్లాపులలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి కొత్త ఎనర్జీ తెచ్చిన సినిమా 'యమదొంగ'. యమదొంగ సినిమా 2007 ఆగస్టు 15న రిలీజ్ అయింది. నేటితో ఆ సినిమా 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్ లో స్టూడెంట్ నెం 1, 'సింహాద్రి' చిత్రాల తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టింది మళ్ళీ యమదొంగ మూవీనే. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా కలెక్షన్లు వర్షం కురిపించింది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఈ సినిమా రాజమౌళి ఎన్టీఆర్ ల కాంబి లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. సింహాద్రి నుండి యమదొంగ వరకు మధ్యలో ఎన్టీఆర్ ఆరు సినిమాలు చేశారు. ఆంద్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ. వీటిలో సాంబ, రాఖీ చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.

మిగతా నాలుగు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. వరుస పరాజయాలతో ఉన్న ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళితో జతకట్టి యమదొంగ తీశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. ఈ సినిమాలో తన నటనలోని ఇంకో కోణాన్ని చూపించారు. సీనియర్ ఎన్టీఆర్ పౌరాణికం పాత్రల్లో ఆరితేరినవారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడి పాత్రతో మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశారు. అందరితో తాతకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు.

ఈ సినిమాలోని ఒక పాటలో సీనియర్ ఎన్టీఆర్ వచ్చి వెళ్ళేలాగా గ్రాఫిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. రెండో హీరోయిన్ గా మమతా మోహన్ దాస్ చేసింది. యముడి పాత్రలో మోహన్ బాబు మెప్పించారు. ఈ సినిమాలో పాటలు కూడా మంచి విజయం సాధించాయి. సీనియర్ హీరోయిన్ రంభ ఇందులో ఐటెం సాంగ్ చేయడం విశేషం. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథని అందించగా, విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఊర్మిళ గుణ్ణం నిర్మించారు. ఎన్టీఆర్ కి మూడు హిట్లు ఇచ్చిన రాజమౌళితో మరో సారి జతకట్టి 'ఆర్ఆర్ఆర్'తో రెండవ హ్యాట్రిక్ హిట్ కి రెడీ అవుతున్నారు.