Bittiri Satti Got Corona Positive

తెలుగు న్యూస్ చానెల్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆతడు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. టీవీ9 నుంచి బయటకొచ్చి రీసెంట్ గా సాక్షి ఛానెల్ లో చేరాడు సత్తి. "గరం గరం వార్తలు " అనే కార్యక్రమాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు. సాక్షి ఛానెల్ టీఆర్పీల్లో ఈ కార్యక్రమానిదే అగ్రస్థానం. మొదటి 4 స్థానాల్లో ఇదే నిలిచింది. ఇలా ఓ వైపు ప్రొగ్రామ్ క్లిక్ అవ్వగా, అలా కరోనా కరోనా బారిన పడ్డాడు సత్తి. సత్తికి కరోనా సోకడంతో.. ఆయన టీమ్ మొత్తం ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది.

తన కార్యక్రమంతో దిల్ ఖుష్ దివ్య, వార్తల వాణి అనే ఇద్దరమ్మాయిల్ని పరిచయం చేశాడు సత్తి. ఇప్పుడు వాళ్లు కూడా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇలా "గరంగరం వార్తల" టీమ్ మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లిపోవడంతో.. సాక్షి ఛానెల్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మరో 2 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని ఆపేస్తారా.. లేక ఇదే టైటిల్ పైన మరేదైనా ప్రత్యామ్నాయ ప్రోగ్రాం రెడీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రొగ్రామ్ ను నటుడు, రచయిత తణికెళ్ల భరణితో ప్రారంభం చేసారు సత్తి క్వారంటైన్ నుండి బయటకు వచ్చేదాకా ప్రస్తుతం ఒకవేళ ఆయనతోనే కొన్ని రోజులు నడిపిస్తారేమో వేచి చూడాలి.

9