cm kcr review on heavy rains

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‍ ఆదేశించారు. ఆయా జిల్లాల అధికారులకు తగు సూచనలు చేశారు. భారీ వర్షాలతో అనేక చేరువులు అలుగుపోస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‍లో 2 కంట్రోల్‍ రూమ్‍లను ఏర్పాటు చేయాలని, మంత్రులు జిల్లాలోనే ఉండి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‍, కరీంనగర్‍ జిల్లాలోని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‍ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. ఉమ్మడి వరంగల్‍, కరీంనగర్‍ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయిందని, ఆ రెండు జిల్లాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని, వరదలో చిక్నుకున్నవారి కోసం ఉపయోగిస్తామని కేసీఆర్‍ పేర్కొన్నారు.