Coronavirus Positive Cases in AP

ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్‍ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,81,817కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‍ కేసులు ఉండగా, 1,91,117 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‍లో పేర్కొంది. ఒక్క రోజులో 10,414 మంది కోలుకున్నారని వెల్లడించారు. గత 24 గంటల్లో 53,712 నామూనాలు పరీక్షించగా, ఇప్పటి వరకు మొత్తం 28,12,197 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా 87 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, గుంటూరులో 9 మంది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో 8 మంది, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 7 మంది, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంలో 6 మంది, ప్రకాశం, శ్రీకాకుళంలో జిల్లాల్లో 5 మంది, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,562కి చేరింది.