telangana american telugu association summer sandadi grand finale

ప్రతిభను ప్రదర్శించిన కళాకారులు...వేలాదిమందికి ఉల్లాసాన్ని కలిగించిన కార్యక్రమాలు

కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా ప్రపంచమంతా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దానికి తోడు చాలామంది బయటకు రాలేని పరిస్థితి ఉంది. పిల్లలు, పెద్దలు ఇంట్లోనే బందీలైపోతున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ కోసం తెలంగాణ అమెరికన్‍ తెలుగు అసోసియేషన్‍ సమ్మర్‍ సందడి 2020 పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా కార్యక్రమాలను నిర్వహించింది.

టాటాఅధ్యక్షుడు భరత్‍ మదాది ఆలోచనతో సాహిత్యం, కళ, స్వర ప్రతిభ, నృత్యం మరియు ఫ్యాషన్‍ ప్రదర్శనలు, టాటా ఇంట్లో తారల సందడి, వెభావరి, జూమ్‍వోకె, చిత్రం-భళారే విచిత్రం వంటి కార్యక్రమాలతో ఈ సమ్మర్‍ సందడి మీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆన్‍లైన్‍ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఇంట్లోనే చిన్నారులు, పెద్దలు ఉండిపోవడం వల్ల వారిలో ఏర్పడిన మానసిక ఆందోళన, భయం నుంచి వారిని బయటకు తీసుకురావడమే. అందుకు అనుగుణంగా ఎంటర్‍టైన్‍మెంట్‍కు ప్రాముఖ్యతనిస్తూ కార్యక్రమాలను టాటా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ ఈ కార్యక్రమాల్లో అవకాశాన్ని టాటా అందించింది. దాంతో గత మూడు నెలలుగా జరిగిన కార్యక్రమాల్లో ఎంతోమంది పాల్గొని తమ కళానైపుణ్యాలను, పాటలు, డ్యాన్స్లలో ప్రతిభను ప్రదర్శించారు.  కార్యక్రమాలు టీవీ, యూట్యూబ్‍ ఛానెల్స్ మరియు ఫేస్‍బుక్‍లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కే ప్రజలు వివిధ మీడియాలో ఈ ప్రదర్శనను చూశారు. ఈ పోటీల కారణంగా అనేకమందికి తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

అధ్యక్షుడు భరత్‍ ఈ కార్యక్రమాల ద్వారా లివింగ్‍ రూమ్‍లో వర్చువల్‍ కన్వెన్షన్‍కు తెరతీశారు. ఈ కార్యక్రమం చిన్నదిగా ప్రారంభమైనప్పటికీ తరువాత బాగా విస్తారమైంది. దర్శకుడు నాగ్‍ అశ్విన్‍, మ్యూజిక్‍ రఘు కుంచె, సూపర్‍ గురు రామచారి, గాయనీ గాయకులు శారద ఆకునూరి, వందేమాతరం శ్రీనివాస్‍, వేణుశ్రీరంగం, జబర్దస్త్ బుల్లెట్‍ భాస్కర్‍, ప్రఖ్యాత వీణ విద్యాంసుడు ఫణి నారాయణ, గీత రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ, సాహితీవేత్త చిట్టెన్‍రాజు, సుధాకర్‍ ఉప్పల, సామాజికవేత్త  డాక్టర్‍ ఆనంద్‍ కుమార్‍ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూమ్‍వోకె, ఆన్‍లైన్‍ కరవోకే వంటి కార్యక్రమాలు నాన్‍స్టాప్‍గా 9 ఎపిసోడ్‍లు సాగి వేలాదిమంది ప్రేకులను ఆనందపరిచాయి. ప్రతి ఎపిసోడ్‍ 6 గంటలాపు నాన్‍స్టాప్‍గాసాగి ప్రముఖ అతిధులతో అందరిని అలరించింది. ప్రతి సెషన్‍లో 6 గంటల నాన్‍స్టాప్‍గా పాటలు పాడటం విశేషం.

దాదాపు 10 వారాంతాలు సాగిన ఈ వినోద కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించడంలో టాటా ప్రెసిడెంట్‍ భరత్‍తోపాటు వారి టీమ్‍ చేసిన కృషి మరువలేనిది. అందరూ కలసికట్టుగా ఈ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు.

టాటా అధినాయకులు, వ్యవస్థాపకులు డాక్టర్‍ పైళ్ళ మల్లారెడ్డి, విజయపాల్‍ రెడ్డి, ఎసి చైర్‍, డాక్టర్‍ హరనాథ్‍ పొలిచెర్ల,  ఎసి కొచైర్‍ మరియు ఎసి సభ్యుడు మోహన్‍ పాటలోల్లా, మరియు ఎగ్జిక్యూటివ్‍ కమిటీ సభ్యులు, స్టాండింగ్‍ కమిటీలు ఈ కార్యక్రమ విజయవంతానికి మద్దతు ఇచ్చారు. ఇందులో పాల్గొన్న ఎంతోమందికి, ఆర్గనైజర్లకు టాటా అధ్యక్షులు భరత్‍ మాదాడి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్‍ గుదురు, మాధవి సోలేటి, అశోక్‍ చింతాకుంత, నిశాంత్‍ సిరికొండ, పవన్‍ రవ్వ, జ్యోత్స్నపాలకూరి, రామ కుమారి, రఘురామ్‍ పన్నేలా, స్మితా పెడిరెడ్డి, ఉషా మన్నం, ప్రవీణ్‍ గుదురు, మౌనికాది, వణ్దికాడి, బుర్రా, దీప్తి మిర్యాల. సమ్మర్‍ సందడి సలహాదారులకు ప్రత్యేక కార్యనిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్‍ డైరెక్టర్‍, వెంకట్‍ ఎక్క, ఎగ్జిక్యూటివ్‍ కోఆర్డినేటర్‍, వారి అపారమైన సహాయం కార్యక్రమాలను విజయవంతం చేసింది. వివిధ ప్రముఖుల అతిథులకు రాకతో కార్యక్రమాలు మరింతగా హైలైట్‍ అయ్యాయి. సోషల్‍ మీడియాను నిర్వహించినందుకు నిశాంత్‍ సిరికొండకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్లైయర్స్ కోసం పవన్‍ రవ్వా మరియు ఈవెంట్స్ సహాయం కోసం వాణి సింగిరికొండ. సమ్మర్‍ సందడి 2020 జ్ఞాపకాలను నిధిగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ద్వారా మరియు తన వెబ్‍ వారి బృందంతో కలిసి సహకరించిన శ్రీనివాస్‍ గూడురుకు టాటా అధ్యక్షులు భరత్‍ ధన్యవాదాలు తెలిపారు.

Click here for Photogallery