Pawan Kalyan Flag Hoisting 2020

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్‍లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్‍ కల్యాణ్‍ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజి చిత్రపటాలకు పూలమాల వేశారు. కొవిడ్‍ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్‍ నాదెండ్ల మనోహర్‍, తెలంగాణ ఇన్‍ఛార్జి శంకర్‍ గౌడ్‍, పార్టీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.