pm-narendra-modi-live-independence-day-speech-to-begin-shortly

ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్‍ఘాట్‍ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద భద్రత గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఓవైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 4 వేల అథితులు హాజరయ్యారు. అదే స్థాయిలో భద్రత సిబ్బంది కూడా మోహరించారు.