US to resume student visa processing in five metros from August 17

ఈ నెల 17 నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులకు వీసాలను ఇవ్వాలని యూఎస్‍ రాయభార కార్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‍ కోల్‍కత్తాలోని యూఎస్‍ వీసా కార్యాలయాలు ఈ నెల 17 నుంచి పరిమిత స్థాయిలో పనిచేయనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు, ఇతర అత్యవసర విజిటర్లకు వీసాలను జారీ చేయడం కోసం వీటిని తెరుస్తున్నారు. ఆన్‍లైన్‍లో వీసా స్లాట్‍లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.