Supreme Court denies GOP request allows RI pandemic related relief on mail in ballots

నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్-బాక్స్ ఓటింగ్, అంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా అమెరికా పౌరులు ఓటు వేసే పద్ధతి ని అధ్యక్షుడు ట్రంప్ సరియైన పద్ధతి కాదు అని , మెయిల్-బాక్స్ ఓటింగ్ ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే ఆస్కారం ఉంటుంది అని పలుసార్లు అభిప్రాయపడగా, పెరుగుతున్న కరోనా వైరస్ దృష్ట్యా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, కామన్ కాజ్ ఆఫ్ రోడ్ ఐలాండ్, రోడ్ ఐలాండ్ యొక్క మహిళా ఓటర్ల లీగ్, మరియు ముఖ్యమైన అనారోగ్య సమస్యలు ఉన్న ముగ్గురు ఓటర్లు ఫెడరల్ వ్యాజ్యం ద్వారా వ్యక్తిగతం గా పోలింగ్ కేంద్రానికి వచ్చి వోట్ వెయ్యాలి అన్న పద్థతి అవసరాన్ని గత నెలలో సుప్రీంకోర్టు లో సవాలు చేయగా రోడ్ ఐలాండ్ రిపబ్లికన్ నాయకుల న్యాయవాదులు “రోడ్ ఐలాండ్ ప్రజలు వ్యక్తిగతం గా పోలింగ్ కేంద్రానికి వచ్చి వోట్ వెయ్యాలి” అని చేసిన వాదనలు ను గురువారం 13 ఆగస్టు న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్ ఐలాండ్ ప్రజలు మెయిల్-బాక్స్ ఓటింగ్ పద్దతి ని సరిగ్గా అనుసరించగలరు అని , ఇన్వలిద్ ఓటింగ్ కి ఆస్కారం తక్కువ ఉన్నట్టు సుప్రీంకోర్టు భావించినట్టు రోడ్ ఐలాండ్ ప్రజల తరుఫు న్యాయవాదులు తెలిపినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నందున మరియు వారు మెయిల్ ద్వారా ఓటు వేయగలిగితే నే మెయిల్ ద్వారా ఓటు వేస్తారు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి వివరించినట్లు తెలిసింది. ఈ తీర్పు పై రోడ్ ఐలాండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేయగా , రిపబ్లికన్ నాయకులు మాత్రం 2020 జూన్ నెలలో జరిగిన ఎన్నికలు లాగా అస్తవ్యస్తం గా నవంబర్ ఎన్నికలు జరిగితే అమెరికా ఎన్నికల వ్యవస్థపైన ప్రజల కు ఉన్న విశ్వాసం తీవ్రంగా దెబ్బతింటుంది అని అభిప్రాయపడినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.