Indian Americans support kamala haaris

అమెరికన్ డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షులని ఎన్నుకోవడం లో కొన్ని నెలలు సమయం తీసుకున్న ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిస్టర్ బిడెన్ అమెరికా రాజకీయ వ్యవస్థ లో ప్రధాన పార్టీ ఉపాధ్యక్ష పదవికి మొదటి సారి ఒక నల్లజాతి మహిళ , ఇండియన్-అమెరికన్, ఆసియా అమెరికన్ మహిళ అయినా శ్రీమతి కమలా దేవి హారిస్ ని ఎన్నుకోవడం అన్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం గా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

ఒక నల్లజాతి మహిళ గా మరియు ప్రాసిక్యూటరీ నేపథ్యం వ్యవస్థలో శ్రీమతి హారిస్ పోషించిన పాత్ర పై రాజకీయంగానే కాకుండా అన్ని రకాలుగా విమర్శలను ఎదురుకున్న శ్రీమతి కమలా దేవి హారిస్ సగం భారతీయురాలు కావడం విశేషం. భారత దేశానికి చెందిన వైద్యులు డాక్టర్ శ్రీమతి శ్యామల గోపాలం కు జమైకాలో జన్మించిన ఆర్థికవేత్త డోనాల్డ్ హారిస్ కు శ్రీమతి కమలా దేవి హారిస్ జెంమించినట్లు ఆమె తెలిపారు.

శ్రీమతి కమలా దేవి హారిస్ ను ప్రధానంగా పెంచిన ఆమె తల్లి డాక్టర్ గోపాలన్ ప్రభావం శ్రీమతి హారిస్ పై చాలా ఉంది అని , ఆమె తల్లి డాక్టర్ గోపాలన్ చాలా ఆత్మవిశ్వాసంతో గర్వంగా ఒక నల్లజాతి స్త్రీగా శ్రీమతి హారిస్ ను పెంచినట్లు మరియు చిన్నతనంలో కుటుంబం తో కలిసి భారతదేశానికి వెళ్ళినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆమె తాతయ్య గారి ప్రభావం ఆమె పై చాలా ఉన్నట్లు మరియు తల్లి డాక్టర్ గోపాలన్ కుటుంబం చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు అని శ్రీమతి హారిస్ తెలిపారు. ఇంటర్వ్యూలలో, భారతీయ-అమెరికన్ నాయకులు మరియు సంఘం న్యాయవాదులు మిస్టర్ బిడెన్ , ఒక భారతీయ తల్లి మరియు జమైకా తండ్రి కుమార్తె శ్రీమతి హారిస్ ఎంపికను అధ్యక్షులు ట్రంప్ వలసదారులను దెయ్యంగా తిరస్కరించడం మరియు అమెరికన్ అవకాశంపై శక్తివంతమైన ప్రకటనలకు సమాధానం అని తెలుపగా పలువురు మిస్టర్ బిడెన్ ఎంపిక ఒక చారిత్రాత్మకమైనదని గా అభివర్ణించారు.