Trump gives TikTok a new deadline: 90 days instead of 45

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకులలో ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్ ను అమెరికా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే అయితే గత వారం మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్ సంస్థను కొనుగోలు చేయడానికి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి అని వచ్చిన వార్తల కు అమెరికా అధ్యక్షులు ట్రంప్ మద్దతు ఇవ్వను అని కచ్చితంగా చెప్పగా, శుక్రవారం 14 ఆగస్టు న 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల లో భాగం గా అమెరికా కు చెందిన టిక్ టాక్ వినియోగదారుల సమాచారాన్ని బీజింగ్ ఆధారిత యాజమాన్యం చైనా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం 14 ఆగస్టు న విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులో జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా చైనా మాతృ సంస్థ టిక్‌టాక్ తన యుఎస్ ఆస్తులను 90 రోజుల్లో విక్రయించాలని ఆదేశించారు.

2017 లో మ్యూజికల్.లీని కొనుగోలు చేసి టిక్‌టాక్‌లో విలీనం చేసిన బైట్‌డాన్స్ , యునైటెడ్ స్టేట్స్ యొక్క జాతీయ భద్రతకు హాని కలిగించే నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉంది అని అనడానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి అని అధ్యక్షులు ట్రంప్ బైట్‌డాన్స్ ను హెచ్చరించినట్లు తెలిసింది.