President Ram Nath Kovind Independence Day 2020 Speech

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా విజృంభణతో ప్రజల జీవన స్థితిగతులే మారిపోయాయని.. ఈ వైరస్‌ పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో నెలకొన్న కష్టకాలంలో కేంద్రం అనేక పథకాల ద్వారా సాయం చేసిందన్నారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న యోధులకు దేశం రుణపడి ఉందన్నారు. వందేభారత్‌ కార్యక్రమం ద్వారా 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు.

మహాత్మా గాంధీ మన స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గదర్శి కావడం మన అదృష్టం. ఒక సాధువు, అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే రాజకీయ నాయకుడి మధ్య సమన్వయం భారతదేశంలో మాత్రమే సాధ్యమైందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాలు ఇంతకుముందులా జరగవు. దీనికి కారణం స్పష్టంగా ఉంది. ప్రపంచమంతా ప్రాణాంతకమైన వైరస్‌తో ముడిపడి ఉంది, ఇది జీవితానికి భారీ నష్టాన్ని కలిగించింది, అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకం కలిగించిందని రాష్ట్రపవతి వ్యాఖ్యానించారు.