Krish Next With Vaishnav Tej

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `వ‌కీల్‌సాబ్‌` సినిమా చేస్తున్నాడు ప‌వ‌న్‌. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్ష‌న్‌లో `విరూపాక్ష‌` అనే మరో సినిమా చేస్తున్నాడు. కోహినూర్ వజ్రం నేపథ్యం ఉండబోతుందని తెలుస్తుంది. ఏఎం రత్నం ఈ సినిమాను దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ చిత్రం విడుదల చేయాలని చూస్తున్నారు

దర్శక నిర్మాతలు. ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్త‌యింది కూడా. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం ఏ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. మ‌రో నాలుగు నెల‌ల‌పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ షూటింగ్‌కి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో క్రిష్ మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాను ప‌క్క‌న పెట్టి కొత్త సినిమా స్టార్ట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. సాయి ధరమ్ తేజ్ సోద‌రుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ఫారెస్ట్ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. నాన్ స్టాప్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించబోతుంది.

వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన `ఉప్పెన‌` లాక్‌డౌన్ కార‌ణంగా రిలీజ్ ఆగిపోయింది. ఇప్ప‌టికే ఈ సినిమాలోని పాట‌లు పెద్ద హిట్ అయి సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమా ఓకే చేసేశాడు వైష్ణ‌వ్‌. త‌న‌కి వున్న నాలుగు నెల‌ల టైమ్‌లోనే వైష్ణ‌వ్ తేజ్ సినిమా కంప్లీట్ చెయ్యాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ షూటింగ్‌కి వెళ్ళిపోతాడు. మ‌రి అర్జెంట్ క్రిష్ ఈ సినిమా ఎందుకు స్టార్ట్ చేశాడో ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు.