China Says Frozen Chicken Wings From Brazil Test Positive For Coronavirus

బ్రెజిల్‍ నుంచి దిగుమతి అవుతున్న కోడి మాంసంలో కరోనా వైరస్‍ ఉన్నదని చైనా ప్రకటించింది. బ్రెజిల్‍ నుంచి చైనాలో షెంజెన్‍ నగరానికి సరఫరా చేసిన నిల్వ ఉంచిన కోడిరెక్కలను పరీక్షించగా కరోనా వైరస్‍ ఉన్నట్టు తెలిసిందని చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ చికెన్‍ను తినొద్దని షెన్‍ జెన్‍ అధికారులు ప్రజలకు సూచించారు. బీజింగ్‍ లోని జిన్‍ఫడీ మార్కెట్లో కరోనా వెలుగుచూసిన తర్వాత చైనా దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల మాంసాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నది.