donations-flow-after-kamalaharis-election-as-deputy

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహారిస్‍ ప్రభంజనం అప్పుడే మొదలైంది. డెమోక్రటిక్‍ పార్టీ ఉపాధ్యక్ష పదవికి భారత మూలాలున్న కమలాహారిస్‍ను ఎంపిక చేసిన అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‍కు విరాళాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. కమలాహారిస్‍ను డిప్యూటీ ప్రెసిడెంట్‍ అభ్యర్థిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయనకు 2.6 కోట్ల డాలర్లు (రూ.194.5 కోట్లు) విరాళాలు లభించాయి. గతంలో బిడెన్‍ ఒక్క రోజులో సేకరించిన గరిష్ట విరాళాలకు ఇద్ది రెట్టింపు.