Allu Arjun pens a heartfelt note for Puri Jagannadh s podcast

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్‌కి సినీ ప‌రిశ్ర‌మ‌లోనే కాదు బ‌య‌ట కూడా పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయ‌న సినిమాల్లో న‌టించిన చాలా మంది హీరోలు ఆయ‌న్ను బాగా ఇష్ట‌ప‌డ‌తారు. అందుకు పూరి త‌న సినిమాల్లో హీరోల‌కు స‌రికొత్త లుక్ ఇచ్చి అమాంతం త‌న ఇమేజ్ మార్చేయ‌డంతో పాటు వాళ్ల‌తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ‌డం కూడా కార‌ణమే. మ‌రోవైపు ద‌ర్శ‌కుడిగానే కాకుండా పూరి జ‌గ‌న్నాథ్ విభిన్న అంశాల‌పై త‌న‌దైన శైలిలో చేసే విశ్లేష‌ణ చెప్పే సంగ‌తులు ఆక‌ట్టుకుంటాయి. అప్పుడ‌ప్పుడు తాను చెప్పే అంశాల‌కు వ‌స్తున్న స్పంద‌న‌ను స్ఫూర్తిగా తీసుకున్న పూరి ఇటీవ‌ల రెగ్యుల‌ర్‌గా పోడ్‌కాస్ట్ ద్వారా తన ఆలోచనలను, అభిప్రాయాలను నేరుగా అభిమానులతో పంచుకుంటున్నారు. వీటికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది.

ఈ నేప‌ధ్యంలో తాజాగా ఆయ‌న పోడ్‌కాస్ట్ ద్వారా చెప్పే విష‌యాల‌కు ఓ స్టార్ హీరో ఫిదా అయిపోయాడు. అత‌నెవ‌రో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. "పూరి గారు మీ పోడ్‌కాస్ట్‌లలో చెబుతున్న అద్భుతమైన అంశాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చాలా గొప్పగా, బ‌లంగా ఉన్నాయి. వ్య‌క్తిగ‌తంగా నాకు బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్ని మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా"నని బన్నీ ట్వీట్‌ చేశాడు. దీనికి స్పందించిన పూరి... "బన్నీ నీ ట్వీట్‌ను చదువుతూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నా. నీ లాంటి సక్సెస్‌ఫుల్ యువ‌కుడి నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తా. చీర్స్ లవ్ యూ" అంటూ రిప్లై ఇచ్చారు.