AP High Court directs government not to use mining lands for house site pattas says it belongs to centre

ఆంధప్రదేశ్‍ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‍ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‍ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వాని ఆదేశించింది. ఈ మేరకు ఇళ్ల స్థలాలకు మైనింగ్‍ భూమి కేటాయింపుపై మథ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‍ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.