High Court pulls up Telangana government

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఎస్‍ సోమేష్‍కుమార్‍ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటి అమలు కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనాపై ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమని ప్రశ్నించింది. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్‍ సెక్రటరీపై హైకోర్టు సీరియస్‍ అయింది. ప్రైవేట్‍ ఆస్పత్రులు పీడిస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎస్‍ను ఉద్దేశించి న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటివరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేష్‍కుమార్‍ తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. దీంతో మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.