telangana independence day celebrations at pragati bhavan

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఆగస్టు 15న ఉదయం 10:30 గంటలకు తన అధికారిక నివాసం ప్రగతిభవన్‍లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్‍ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనడం ఆనవాయితీ. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపించి ఉన్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన ఈ వేడుకలను ఈసారి ప్రగతిభవన్‍కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.