Ravi Teja s upcoming film with director Ramesh Varma titled Khiladi

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "క్రాక్" అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత "వీర" సినిమాతో తనకు ఫ్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో మళ్ళి ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో రానున్న సినిమాకు "ఖిలాడి" అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.అయితే గత కొంత కాలంగా రవితేజ నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. "రాజా ది గ్రేట్" సూపర్ హిట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన "టచ్ చేసి చూడు", "నేల టికెట్", "అమర్ అక్బర్ ఆంటోనీ", "డిస్కో రాజా" ఇలా చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం రవితేజ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే "మేము వయసుకు వచ్చాం", "సినిమా చూపిస్తా మామ", "నేను లోకల్", "హలో గురు ప్రేమకోసమే".. వంటి కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్స్ తీసిన త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, రమేష్ వర్మ, వక్కంతం వంశీ.. ఇలా చాలా మందికి అవకాశమిచ్చి లైన్లో పెట్టాడు. మరి ఈ సినిమాలలో కనీసం ఒక్క సినిమా అయినా హిట్ అయితే రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో వేచి చూడాలి..