Anchor Anasuya to play crucial role in Allu Arjun s Pushpa movie

దర్శకుడు సుకుమార్ రంగస్థలం చిత్రంలో యాంకర్ అనసూయకు రంగమ్మత్త గా సినీ రంగంలో కలకాలం గుర్తుండి పోయే మంచి పాత్రను ఇచ్చారు. ఆ పాత్రకు ఆమెకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తాజా సినిమా నటిస్తున్న 'పుష్ప' సినిమా మెయిన్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న కథ కాబట్టి 'లేడీ స్మగ్లర్' గా యాంకర్ అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా పుష్ప. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అనసూయ ఓ లేడీ స్మగ్లర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరేమో కాదు కాదు అది కళ్లు కనపడని మధ్యవయస్కురాలిగా గా నటిస్తున్నట్లు చెప్తున్నారు. ఆ పాత్ర కారణంగానే సినిమా లో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని సమాచారం. ఈ సినిమాకు కూడా సుకుమార్ తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇపుడు చేస్తున్న "పుష్ప" సినిమాలో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రే అని తెలుస్తోంది. ఆ పాత్ర కారణంగానే సినిమా లో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని సమాచారం.

"విన్నర్", "క్షణం", "గాయత్రి", "కథనం" వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హ్యాట్రిక్ మూవీగా రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.