KGF: Chapter 2 to resume shooting marks Sanjay Dutt s entry to South Indian cinema

కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా మూవీగా కన్నడ సినీ పరిశ్రమ కూడా తన పవెర్ ఏమిటో నిరూపించిన సినిమా. యష్ హీరోగా వచ్చిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కోసం రాజకీయ శక్తులు పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా భారీ హిట్ అయింది. అప్పటి దాకా కన్నడ సినిమా ఇండస్ట్రీ అంటే స్మాల్ బడ్జెట్ తో పది సంవత్సరాల క్రితం కథలతో వెనకుంటారని మిగతా వాళ్ళకి చాలా చిన్నచూపు ఉండేది. కానీ ఈ సినిమా ఆ అసమానతలన్నిటినీ ఒక్క దెబ్బకు మాయం చేసింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ బాషలలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మీద ముందే నమ్మకమున్న దీని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు.

ఇప్పుడు అదే కేజీఎఫ్‌-2. మొదటి పార్ట్ లో లానీ యష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ని విలన్‌ రోల్ కి ఎంపిక చేశారు. 'అధీరా' అనే మదపుటేనుగు లాంటి పాత్రలో ఆయన్ని చూపించనున్నారు. పది రోజుల క్రితం ఈ సినిమా నుండి కొన్ని సందర్భాల్లో రిలీజ్ అయిన హీరో, విలన్‌ పోస్టర్లకు అయితే ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా అధీరా లుక్‌లో సంజయ్‌ దత్‌ కనిపిస్తున్న తీరు మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే. అయితే నిన్న రాత్రి (ఆగష్టు 11న) సంజయ్‌ దత్‌ స్టేజ్‌-03 లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడినట్టు వైద్యులు నిర్దారించారు.

ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స కోసం అమెరికా బయలుదేరాడు సంజయ్ దత్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే అందరికీ అవగాహన ఉండే ఉంటుంది, కానీ ఈయనకు వచ్చింది లంగ్ క్యాన్సర్. మామూలు క్యాన్సర్ ల ట్రీట్మెంట్ లు చేయిస్తేనే పేషెంట్లు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఇది లంగ్ క్యాన్సర్ కావడంతో ఎప్పటికి ఈయన తిరిగి వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కేజీఎఫ్‌2 టీం. ఎందుకంటే సంజయ్‌ దత్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా ఎక్కువే వుంది. ‌ ఇప్పటికే ఈ సినిమా కూడా ఆర్.ఆర్.ఆర్ లాగా వాయిదాలు పడుతూ ఇప్పుడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పుడు సంజయ్‌దత్‌ దెబ్బకు మళ్ళీ వాయిదా పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా త్వరలోనే సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ మహమ్మారి నుండి తప్పించుకుని తిరిగి ఆరోగ్యంగా రావాలని తెలుగు టైమ్స్ .నెట్ కోరుకుంటుంది.