IAF writes to CBFC opposing ‘undue negative portrayal in Janhvi Kapoor s Gunjan Saxena

 జాన్వీ క‌పూర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన‌ సినిమా `గుంజ‌న్ స‌క్సేనా.. ద కార్గిల్ గ‌ర్ల్‌`. జాన్వీ ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన‌ ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంటోంది. బుధ‌వారం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. అయితే అంత‌కుముందు విడుద‌లైన ట్రైల‌ర్ చూసిన ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఆగ్ర‌హం ఈ సినిమాపై వ్య‌క్తం చేసింది. ఈ సినిమాలో కొన్ని అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని సెన్సార్ బోర్డ్‌కు ఓ లేఖ రాసింది. ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు ఎయిర్‌ఫోర్స్‌ను నెగెటివ్‌గా చూపించాయ‌ని తెలియ‌జేసింది ఐఎఎఫ్‌. ఈ లేఖ‌ను నెట్‌ఫ్లిక్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌కు కూడా పంపింది. ఈ సినిమాను ప్రారంభించిన‌పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవ మర్యాదలు పెంచేలా తీస్తామని చెప్పింద‌ట చిత్ర యూనిట్‌. కానీ, ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తుంటే అందులో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయ‌నే విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ఐఎఎఫ్ పేర్కొంది. గుంజన్ సక్సేనా క్యారెక్టర్‌‌కి భారీ హైప్ తీసుకురావడం కోసం ఐఏఎఫ్‌ మీద నెగిటివ్ ప్రభావం వచ్చేలా తీశార‌ని అభ్యంతరం తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో లింగ భేదాన్ని చూపే సన్నివేశాలు ఉన్నాయని వివ‌రించారు. ఉదాహ‌ర‌ణ‌కు మొద‌ట్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీస్‌లో మ‌గ‌వారి టాయిలెట్స్ మాత్ర‌మే ఉండేవి. అయితే గుంజ‌న్ స‌క్సేనా లేడీస్ టాయిలెట్ కోసం వెతుకుతున్న‌ట్టు సీన్‌, దానికి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయ‌ని, ఆ సీన్స్‌ని తొలగించ‌డ‌మో లేదా మార్చ‌డ‌మో చేయాల‌ని చిత్ర యూనిట్‌కి సూచించింది ఐఎఎఫ్‌. బ‌యోపిక్ అన్న త‌ర్వాత వాస్త‌వాలు చూపించాల‌ని ఐఎఎఫ్ పేర్కొంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మొట్టమొదటి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా. ఆమె జీవిత కథ ఆధారంగా గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్ అనే సినిమా రూపొందింది. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో గుంజ‌న్ పాల్గొన్నారు. యుద్ధ స‌మ‌యంలో గాయ‌ప‌డిన సైనికులను ర‌క్షించ‌డంలో ఆమె కీల‌క పాత్ర పోషించింది. ఆమె అందించిన సేవలకు గాను శౌర్య వీర్ పురస్కారాన్ని ప్ర‌దానం చేసింది ప్ర‌భుత్వం.