Pawan kalyan double bonanza on his birthday

సెప్టెంబర్ 2 ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు ఈ సారి అభిమానులకు డబల్ ధమాకా ... మొదటిలో పవన్ కళ్యాణ్ తను రాజకీయాలలోకి రాను అన్నప్పుడు అరవై శాతం మంది అతని అభిమానులు చాలా బాధ పడ్డారు, కొన్ని సంవత్సరాల తర్వాత అదే పవన్.. సినిమాలు ఇంక చేయను, ప్రత్యక్ష ప్రజల సేవలోకే వెళ్తాను అని సినిమాలు వదిలి రాజకీయాలలోకి వెళ్ళినప్పుడు అతని అభిమానుల్లో కేవలం నలబై ఐదు శాతం మంది మాత్రమే ఆ నిర్ణయాన్ని ఆహ్వానించారు, తరువాత కొంత కాలానికి సినిమాలు నా వృత్తి, ఆ వృత్తి వలనే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమాలు చేయటం వల్ల వచ్చే డబ్బుతో రాజకీయంగా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయగలను, ఇతర పార్టీలను ఎదుర్కొంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకెల్లగలుగుతాను కాబట్టి సినిమాలు చేస్తూనే రాజ‌కీయసేవలను కూడా ప్రజలకు అందిస్తాను అనే సంకేతాలు ఇవ్వగానేే అతని నూటికి నూరు శాతం అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కుడా ఆహ్వానం పలికారు. ఆ విధంగా మళ్ళి అలా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుసగా రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

అందులో ఒకటి బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ను రీమేక్‌ చేస్తూ ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అలాగే మ‌రో ప‌క్క ఆ సినిమాకి సమాంతరంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ త‌న 27వ సినిమాను కూడా స్టార్ట్ చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ విజృంభించ‌డంతో రెండు సినిమాల షూటింగ్‌ల‌ను ప‌వ‌న్ ఆపేశారు. దీనితో ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడిని తెరపై చూద్దామా అనుకున్న అభిమానుల ఆశలపై కరోన వైరస్ నీళ్ళు చల్లింది.

ఇలాంటి పరిస్థితుల్లో అందిన సమాచారం మేరకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సందర్భంగా సెప్టెంబ‌ర్ 2న క్రిష్ దర్శకత్వంలో రాబోయే మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటుగా ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. టీజర్ కు సంబంధించిన విషయమై ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, నిర్మాత‌లు బోనీ క‌పూర్‌, దిల్‌రాజులు బిజీగా ఉన్నార‌ని సినీ వ‌ర్గాల బోగట్టా.