Congress leader Sunkara Padmasri criticised to PM Narendra Modi

విశాఖలో రాజధాని శంకుస్థాపనకు రావడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా అంటూ అమరావతి మహిళ జేఏసీ నేత, కాంగ్రెస్‍ నేత సుంకర పద్మశ్రీ ఫైర్‍ అయ్యారు. ప్రధాని హోదాలోనే కదా మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. మళ్లీ వైజాగ్‍లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారని ప్రశ్నించారు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో రాజధాని నిర్మాణాన్ని తలపెట్టి అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్నా మోదీ, జగన్‍ పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం తమకు ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరమన్నారు. దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి, రెండో రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.