55 employees of Annavaram temple test Corona Positive

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో కరోనా కలకలం రేపుతుంది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 50 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీంతో ఈవో త్రినాథ రావు దేవదాయశాఖ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరో 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. దీంతో పరీక్షలు చేయించుకున్న వారి కటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 23 వరకు అన్నవరం ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత శనివారం 300 మందికి నిర్వహించిన పరీక్షల్లో 39 మందికి కరోనా మహమ్మారి సోకడంతో ఒక్కసారిగా అలజడి నెలకొంది. కరోనా సోకినవారిలో అధికంగా వ్రత పురోహితులు, అర్చకులున్నట్లు ప్రచారం జరుగుతోంది.