Priyanka Chopra lauds Kamala Harris on being selected as US Vice Presidential candidate

డెమొక్రటిక్‍ పార్టీ తరపున అమెరికా ఉపాధ్య పదవికి అభ్యర్థిగా ఎంపికైన కమలా హ్యారిస్‍కు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. వారిలో బాలీవుడ్‍ నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఇన్‍స్టాగ్రాంలో ఆమె ఫొటోను షేర్‍ చేసి, ఈ ఎంపిక మహిళలకు గర్వకారణమంటూ వ్యాఖ్యానించారు. అని వర్ణాలకు చెందిన మహిళలు, నల్లజాతీయ మహిళలు, దక్షిణాసియా మహిళలు.. ఇది మహిళలందరికీ గర్వకారణమైన సందర్భం. ఈ పదవికి పోటీ పడుతోన్న మొదటి భారతీయ, నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్కు అభినందనలు అని ప్రశంసించారు.